ముంబై నుంచి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మరోల్ ప్రాంతంలో ఒక పిచ్చి ప్రేమికుడు తన మైనర్ ప్రియురాలిని కోపంతో సజీవ దహనం చేయాలని చూశాడు. తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
READ MORE: Congress: కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం.. మూడు కేటగిరీలుగా విభజన
ఈ సంఘటన మార్చి 3వ తేదీ రాత్రి మరోల్ ప్రాంతంలో జరిగింది. వారిద్దరూ మరోల్ ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఏడాది పాటు ప్రేమాయణం సాగింది. సంఘటన జరిగిన రోజున.. ఆ యువకుడు తన మైనర్ ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తనను తాను తగలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు, ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీలో.. ఓ మైనర్ బాలిక శరీరంపై మంటలు చెలరేగుతూ పరిగెడుతున్నట్లు కనిపిస్తోంది. స్థానికులు ఇది గమనించి వారిద్దరినీ.. ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చేర్పించారు.
READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన కోర్టు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి పేరు జితేంద్ర అలియాస్ అలియాస్ జితు తంబే. అతను అంధేరీ నివాసి. ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రేమ వ్యవహారం కొనసాగింది. ప్రియురాలి శరీరం దాదాపు 65 శాతం కాలిపోయింది. మైనర్ బాలిక చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది. ప్రియుడి శరీరం కూడా దాదాపు 30 శాతం కాలిపోయింది. పోలీసులు నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసి హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రియుడు ఇలా ఎందుకు చేశాడు? దీని గురించి పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.