Suryakumar Yadav: కోహ్లీ రికార్డుకు చెక్.. సూర్య భాయ్ నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: ముంబై వానఖేడే స్టేడియంలో జరిగిన ఈ భారత్-అమెరికా మ్యాచ్ ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో నిలిచిపోతుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించింది. స్కోర్‌బోర్డ్ చూసినప్పుడు ఇది సాధారణ గెలుపులా అనిపించొచ్చు. కానీ మ్యాచ్ అంత ఈజీగా సాగలేదు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భుజాలపై వేసుకుని గెలిపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదట్లోనే ఇబ్బందుల్లో పడింది. వరుసగా వికెట్లు పడటంతో స్కోరు నెమ్మదిగా సాగింది. ఒక దశలో పెద్ద స్కోరు అసాధ్యమే అనిపించింది. అప్పుడు క్రీజ్‌లో నిలబడ్డాడు కెప్టెన్ సూర్యకుమార్. మొదట జాగ్రత్తగా ఆడుతూ, తర్వాత తన స్టైల్‌లో షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. నాలుగో వైపు బాల్ వెళ్తే బౌలర్లు అయోమయంలో పడిపోయారు. అతని బ్యాట్ నుంచి 10 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. 49 బంతుల్లోనే నాటౌట్‌గా 84 పరుగులు చేశాడు. చివరకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యం నిలిచింది.
READ MORE: Suryakumar Yadav: శభాష్ సూర్యకుమార్! కెప్టెన్‌గా తొలి ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లోనే అరుదైన ఘనత..
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
లక్ష్యం పెద్దదిగా అనిపించకపోయినా, భారత బౌలర్లు మ్యాచ్‌ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. బౌలర్ అర్షదీప్ సింగ్ మరోసారి మెరిశాడు. అతను రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి ఆశలను తగ్గించాడు. ఈ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్‌లో అర్షదీప్ వికెట్ల సంఖ్య 29కి చేరింది. ఎట్టకేలకు అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక అసలు హీరో సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో సూర్యకుమార్ మరో రికార్డు తన పేరుపై రాసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్‌ల్లో భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. కోహ్లీ 16 సార్లు ఈ అవార్డు గెలిచాడు. సూర్య ఇప్పుడు కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. రోహిత్ శర్మ 14 సార్లు, అక్షర్ పటేల్ 8 సార్లు ఈ అవార్డు గెలిచారు.
READ MORE: Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం
వరల్డ్ కప్ విషయానికి వస్తే సూర్యకుమార్ మరో ప్రత్యేక ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో అతను నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ ఇంకా ముందున్నాడు. కోహ్లీ 35 మ్యాచ్‌లు ఆడి 8 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. సూర్య 19 మ్యాచ్‌ల్లో 4 సార్లు గెలిచాడు. యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ ముగ్గురూ వరల్డ్ కప్‌లో 3 సార్లు చొప్పున ఈ అవార్డు పొందారు. ఇప్పుడు సూర్య వాళ్లందరినీ దాటేశాడు. ఈ గెలుపుతో భారత జట్టు మరో గొప్ప రికార్డు కూడా సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉండేవి. భారత్ ఇప్పుడు వాళ్లను కూడా దాటిపోయింది. గతంలో భారత్ 2012 నుంచి 2014 మధ్య 7 వరుస విజయాలు మాత్రమే సాధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!