‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా రూ.262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు.
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో స్టార్ట్ అయింది.…
యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్. ఈ సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే.. జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నా లవ్ స్టోరీ" ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ చిత్రానికి వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు ఈ సందర్భంగా అజయ్ భూపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. కీలక విషయాలు పంచుకుంది.
హర్షవర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకేన్ జంటగా నటించిన 'సనమ్ తేరి కసమ్' చిత్రం 2016లో విడుదలైంది. ఆ సమయంలో ఈ ప్రేమకథా చిత్రం ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆ చిత్రంలోని పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా మళ్ళీ విడుదలైంది. హిందీలో రీ-రిలీజ్ తర్వాత 'సనమ్ తేరి కసమ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. విక్కీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. చాలా మంది ప్రేక్షకులు ఇది ఒక భావోద్వేగ కథ అని అంటున్నారు. మొదటి రోజు 'ఛావా' సినిమా చూసిన ప్రేక్షకులు…
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ (FASTag) విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. కాగా.. ఫాస్ట్ ట్యాగ్ లో కొత్త రూల్స్ వచ్చాయి.