బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. బైక్‌లు పెట్రోల్‌తో నడుస్తాయి. మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఈవీ, సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ.. డీజిల్ తో నడిచే బైక్స్ మాత్రం మార్కెట్లో లేవు. అసలు డీజిల్ ఇంజిన్లను బైక్స్‌కు ఎందుకు అమర్చరు? ఒక వేళ తయారు చేసి మర్చితే ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: Big twist in Vallabhaneni Vamsi case: వల్లభనేని వంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్..
అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో డీజిల్‌తో నడిచే బుల్లెట్ బైక్‌లను విక్రయించేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఏ వాహన విక్రయాలను ఆపేసింది. దానికి కారణం.. డీజిల్ ఇంజిన్ కంప్రెషన్ నిష్పత్తి 24:1గా ఉంటుంది. అదే పెట్రోల్ ఇంజిన్ కంప్రెషన్ నిష్పత్తి11:1గా ఉంది. కాబట్టి బైక్‌ను డీజిల్ ఇంజిన్‌తో రూపొందిస్తే.. దాని పరిమాణం, బరువు పెద్దదిగా ఉంటుంది. అందుకే బైక్ లాంటి చిన్న వాహనంలో డీజిల్ ఇంజిన్ వాడటం కష్టంగా మారుతుంది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్లు అధిక కంప్రెషన్ నిష్పత్తిని చేస్తాయి. దీంతో ఈ ఇంజిన్ నడుస్తున్నప్పుడు, దాని నుంచి వెలువడే శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అధిక శబ్దంతో పాటు వైబ్రేషన్ కూడా వస్తుంది. దీంతో రైడర్లకు అసౌకర్యం ఏర్పడుతుంది. అలాగే బైక్‌లకు డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లయితే ట్యాంక్ పరిమాణం పెద్దదిగా మారుతుంది. దాంతో బరువు కూడా పెరుగుతుంది. ఇంజిన్ ధర కూడా ఎక్కువగా అవుతుంది. దీని ఫలితంగా బైక్ మొత్తం ధర ఎక్కువగా ఉండొచ్చు. దీని కారణంగా డీజిల్ ఇంజిన్‌తో తయారు చేసే బైక్ విడిభాగాల ధర పెట్రోల్ ఇంజిన్ బైక్‌ల కంటే రెట్టింపు అవ్వొచ్చు.
READ MORE: JNTU: జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీగా టీ కిషన్ కుమార్ రెడ్డి నియామకం