ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
READ MORE: Bayya Sunny Yadav: జ్యోతి మల్హోత్ర, భయ్యా సన్నీ యాదవ్‌ను కలిపి విచారిస్తున్న ఎన్‌ఐఏ..!
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్‌సీబీతో తలపడుతుంది. ఒకవేళ వరుణుడి వల్ల మ్యాచ్ రద్దు అయితే పంజాబ్ కింగ్స్ లాభపడుతుంది. ఎందుకంటే.. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగ్గా ఉంది. ఆ లెక్కన టేబుల్ టాపర్‌గా నిలిచినందున పంజాబ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. కానీ.. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
READ MORE: TDP Leader Brutally Murder: టీడీపీ నేత దారుణ హత్య.. ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి..!
ముంబై తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రాజ్ భావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ.
పంజాబ్ ఫైనల్ టీం..
ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్‌కుమార్ వైశాఖ్, కైల్ జేమీసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.