సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్‌రూఫ్ టాఫ్ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. READ MORE: Kunal Kamra: మధ్యప్రదేశ్‌లో కునాల్ కమ్రా పోస్టర్లు […]
భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. ఈ అంశంపై తాజాగా టీటీడీ స్పందించింది. దీంతో తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్‌పై అటవీశాఖ యూటర్న్ తీసుకుంది. అటవీశాఖ అధికారులు టీటీడీకి కనీస సమాచారం అందించకుండా డ్యాంలో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో బోటింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు.
బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 2, ప్లాట్‌ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించినట్లు భోజ్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజ్ తెలిపారు.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు వివాహం కోసం సోమేశ్ అప్పు చేశాడని…
మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నా... కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా చిట్‌చాట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే.. సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు..
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు.
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తెలంగాణలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న ఓ న్యాయవాది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు.