Bus Accident: కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. “బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు. 20 మంది క్షేమంగా బయటపడ్డారు.” అని కలెక్టర్ సిరి తెలిపారు.
READ MORE: Kurnool Bus Accident: కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి!
అయితే.. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు. వింజమూరు మండలం గోల్లవారి పాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబం సజీవదహనమైంది. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.. భార్య ఇద్దరు పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
READ MORE: Pradeep Ranganathan : పాన్ ఇండియా ‘హ్యాట్రిక్ స్టార్’ ప్రదీప్ రంగనాథన్
కాగా.. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమరెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించారు. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.