Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మూసా పేట్ నుంచి 9.30 కి స్టార్ట్ అయ్యింది. ఆరంఘడ్ చౌరస్తా నుంచి రాత్రి 11గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయల్దేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్‌తో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 38 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్ నెంబర్ DD 01 N 9490. 2.14 AMకు అలంపూర్ టోల్ గేట్ దాటింది. లేన్ నెంబర్ 10 నుంచి ఎంట్రీ అయ్యింది. ఇక్కడి నుంచి 45 నిమిషాల్లో చిన్న టేకూరు వద్దకు చేరుకుంది.
READ MORE: Pradeep Ranganathan : పాన్ ఇండియా ‘హ్యాట్రిక్ స్టార్’ ప్రదీప్ రంగనాథన్