Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ప్రమాదంలో హృదయవిదారక కథలు వినిపిస్తున్నాయి. తాజాగా తల్లి, కొడుకు ఇద్దరూ సజీవ దహనమైన కేసుల వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నుంచి కావేరి ట్రావెల్ బస్సులో బయలుదేరిన వారిలో బెంగుళూరుకు చెందిన ఫీల్ మన్ బేబీ(64), ఆమె కుమారుడు కిశోర్ కుమార్ (41) ఉన్నారు. వీరు ఇరువురు పటాన్ చెరు లోని కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటున్న అక్క పద్మ ప్రియ, బావ రాము ఇంటికి దీపావళి పండగ సందర్భంగా వచ్చి నిన్న రాత్రి పటాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రావెల్ బస్సు ఎక్కి బయల్దేరారు. అగ్ని ప్రమాదంలో వీరు ఇరువురు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
READ MORE: Jubilee Hills By-Election: ఉప ఎన్నిక నామినేషన్ల ఉప సంహారణకు నేడు చివరి అవకాశం..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:
9912919545 – ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
9440854433 – ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్