Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి అవకాశం. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఉపసంహరణ మినహా బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మిగతా స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. మొత్తం 81 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, నిన్న ఒక్క అభ్యర్థి కూడా ఉపసంహరణకు ముందుకు రాలేదు. అయితే, ఈరోజు మధ్యాహ్నం వరకు కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించే అవకాశం ఉందని ఎన్నికల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
READ MORE: Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
కాగా.. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్‌లు సిద్ధం చేసుకున్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు మించి అవసరం రాకపోవచ్చునని అంచనా వేశారు. కానీ నామినేషన్లు పెరిగితే అదనపు యూనిట్లు సమకూర్చుకోవడం, ర్యాండమైజేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకునే వీవీప్యాట్‌లను కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
READ MORE: Kurnool Bus Accident: కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి!