గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలో చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అక్క ఇంటికి వెళ్తానని చెప్పి రాజరాజేశ్వరి కాలనీకి వచ్చిన ఆత్మహత్య చేసుకున్నాడు చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ రెడ్డి(28).. రెండు రోజుల కోసం ఓ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న హిలియం సిలిండర్‌తో తెచ్చుకున్నాడు. మొదటి రోజు కాకుండా, మరుసటి రోజు డైరీలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిసింది. సురేష్ రెడ్డి (28) మణికొండలోని ఓ కంపెనీ లో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. పోలీసులు ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: YS Jagan: నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శ.. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఘటన..!