రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ప్రసిద్ధ ఆడపులి “ఆరోహెడ్” మరణించింది. ఆరోహెడ్ వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది ఫిబ్రవరి 2014లో జన్మించిందని అధికారులు తెలిపారు. ఆరోహెడ్, రణథంబోర్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి ‘మచ్లి’ కుటుంబానికి చెందినది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించింది.
READ MORE: Rahul Gandhi: పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కి ఇష్టం లేదు..
ఆరోహెడ్ ఎందుకు ప్రసిద్ధి చెందింది?
నిజానికి.. కొంతకాలం క్రితం ఆరోహెడ్ అనే ఆడపులి చర్చనీయాంశంగా మారింది. ఆరోహెడ్ ఒక జలాశయంలో మొసలిని వేటాడింది. ఈ సంఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరోహెడ్ మొసలిని వేటాడటం ‘మచ్లి’ అనే ఆడపులిని గుర్తుకు తెచ్చింది. మచ్లి ధైర్య సహసాలో ఓ రేంజ్‌లో ఉండేవి. తన వేట నైపుణ్యాల కారణంగా మచ్లి అనే ఆడపులిని ‘రణతంబోర్ రాణి’, ‘మొసలి వేటగాడు’ అని పిలిచేవారు.
READ MORE: Srisailam: శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకులు.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
రణథంబోర్ అటవీ అధికారులు, తదితరులు గురువారం ఆరోహెడ్ కు నివాళులర్పించి, దహనం చేశారు. ఆరోహెడ్ ఎక్కువగా రణథంబోర్ లోని 2, 3, 4, 5 జోన్లలో కనిపించిందని రణథంబోర్ ఫీల్డ్ డైరెక్టర్ అనుప్ కెఆర్ తెలిపారు. నల్ఘాటి, రాజ్‌బాగ్ సరస్సు దాని ప్రధాన ప్రాంతాలు. ఆరోహెడ్ దాని ఆకర్షణీయమైన రూపానికి ప్రసిద్ధి చెందింది. పులి జనాభాను పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ఆరోహెడ్ మొత్తం నాలుగు సార్లు ప్రసవించింది. 10 పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో 6 ఇప్పటికీ బతికే ఉన్నాయి. ఆరోహెడ్ చివరిగా 2023 లో తల్లి అయ్యింది.
Fare thee well Arrowhead 💔
.
Did not go gentle into that good night ,
Raged against the dying of light,
Always a blazing star in our hearts
.
I was incredibly lucky to witness an extremely frail Arrowhead take down a crocodile – a testament to her indomitable resilience and grit pic.twitter.com/BFfwZBruaw— Anirudh Laxmipathy (@anirudh123) June 19, 2025