దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేల మంది…
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీ రాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణోత్సవం రాష్ట్రవ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమాలలో భాగం.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు.
విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం లేఖలో చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్‌లోని 10 ఎకరాల…
పుట్టింది ఇండియాలో.. పెరిగింది అమెరికాలో.. ప్రస్తుతం బేగంపేట్ లో నివాసం.. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్ట (29) అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట వన్ ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లాడు అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ.. కొడుకు బేగంపేట్…
కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు…