ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్క్రమ్ (58), నికోలస్ పూరన్ (61) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మిచెల్…
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.