Real Estate Scam: సొంతిళ్లు కోసం కలలు కనే వారే వారి టార్గెట్. వారికి బ్రోచర్లలోనే వైకుంఠం చూపించడం.. అందిన కాడికి దండుకోవడం ఇలా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. హైదరాబాద్‌లో హంగూ ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు.. ఈ మధ్య కొత్త తరహా చీటింగ్‌కు తెరలేపాయి. ఆ తరహాలోనే 200 కోట్ల వరకు డబ్బు దోచుకుని ఏవీ ఇన్‌ఫ్రా అనే సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇవి చాలవన్నట్లు కొంత మంది రియల్టర్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. అందులో భాగంగా వచ్చిందే బైబ్యాక్ పాలసీ. ఇలాంటి బైబ్యాక్ పాలసీని అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వెలసిన AV ఇన్‌ఫ్రా జనం దగ్గర దాదాపు రూ. 200 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు..
READ MORE: SBI PO 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. ఎస్బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు రెడీ.. మీరూ ట్రై చేయండి
ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లక్ష్మీ విజయ్ కుమార్ గోగుల. ఇతను మాదాపూర్‌లో ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేశారు. ఇతను విజయవాడకు చెందిన ఓ రాజకీయ నేత కుమారుడు. నారాయణ్‌ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో తమ వెంచర్లున్నాయంటూ నమ్మబలికాడు. వెంచర్లలోని ఫ్లాట్లను తామే డెవలప్ చేసి ఇస్తామంటూ మళ్లీ కొనుగోలు దారులతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత డెవలప్‌మెంట్ పేరుతో మరికొన్ని డబ్బులు తీసుకున్నారు. అటు డెవలప్‌మెంట్ చేసి ఇవ్వక.. తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. దాదాపు రూ. 200 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు..
READ MORE: Jeedimetla Murder Case: జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు..
అంతే కాదు బాధితుల నుంచి తప్పించుకునేందుకు మాధాపూర్‌లోని కార్యాలయాన్ని కూడా మూసివేశాడు విజయ్. అలా ఎస్కేప్ అయిన విజయ్… ఒంగోలులోని సంతపేటలో తెలిసినవారి ఇంట్లో తలదాచుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి PT వారెంట్ మీద అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.. విజయ్ కుమార్ గోగులపై ఒక్క మాదాపూర్‌లోనే 3 కేసులు నమోదయ్యాయి. మంచి ఆఫర్స్ అంటూ ప్రకటనలు చేయడంతో పలువురు బాధితులు బైబ్యాక్ పథకానికి ఆకర్షితులయ్యారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలల తర్వాత.. తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితులు విజయ్‌పై ఒత్తిడి పెంచారు. చివరకు తాము మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ తాను వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. దీనికి తోడు పెద్ద ఎత్తున లైఫ్ ఎంజాయ్ చేశారని అధికారులు వెల్లడించారు జల్సాల కోసం ప్రజల సొమ్ముని వాడుకున్నారని చెబుతున్నారు..