మర్డర్.. ఆ తర్వాత విదేశాలకు చెక్కేయడం.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం.. ఇలా అంతా ప్లాన్ చేసుకున్నారు ఐశ్వర్య, తిరుమల రావు. కానీ తేజేశ్వర్ మర్డర్ తర్వాత అంతా రివర్స్ అయింది. వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. దీంతో ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు ఐశ్వర్య.. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్న ప్రియుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఇద్దరూ దేశ ముదుర్లేనని తెలుస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో కిరాక్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్‌ను సుపారీ కిల్లర్స్‌తో చంపించి ఇద్దరూ కలిసి విదేశాలకు పారిపోయి కలిసి ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం 20 లక్షల రూపాయల డబ్బు కూడా సమకూర్చుకున్నారు. పదో తరగతి వరకే చదువుకున్న ఐశ్వర్య.. కన్నింగ్ ప్లాన్స్‌లో మాత్రం PHD చేసింది. అభం శుభం తెలియని తేజేశ్వర్‌ను అతి కిరాతకంగా చంపి తర్వాత.. ప్రియుడైన బ్యాంకు మేనేజర్‌తో వెళ్లి సుఖంగా ఉండాలని ప్లాన్ చేసింది. చివరికి ప్లాన్ బెడిసి కొట్టడంతో ఐశ్వర్య కటకటాలపాలైంది..
READ MORE: Jeedimetla Murder Case: జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు..
ఇక మరోవైపు విదేశాలకు పారిపోతున్న ప్రియుడు తిరుమల్ రావుని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి కన్నింగ్ ప్లాన్ గురించి రివీల్ అయింది. విదేశాలకు వెళ్లేందుకు తన ప్రియురాలు ఐశ్వర్యకు కూడా తిరుమల రావు టికెట్ బుక్ చేసినట్లు తెలిసింది. అయితే..కేసులో ఇరుక్కున్న ఐశ్వర్య రాకపోవడంతో తిరుమలరావు ఒంటరిగా విదేశాలకు వెళ్లిపోతుండగా పోలీసులు వెంటాడి.. వేటాడి పట్టుకున్నారు.. స్పాట్..
READ MORE: Jeedimetla Murder Case: జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు..
తేజేశ్వర్‌ను చంపిన తర్వాత తిరుమలరావు, ఐశ్వర్య కలిసి మొదట లద్దాఖ్ వెళ్లి.. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం రెండు విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు 20 లక్షలు సమకూర్చుకున్నారు. అందులో నుంచే సుపారీ గ్యాంగ్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ నెల 17న తేజేశ్వర్‌ను హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చిపెట్టాలని అనుకున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం వైపు వెళ్లి అడవిలో పడేశారు. తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపట్టారు..
READ MORE: UP: పొలంలో రహస్యంగా కలిసిన ప్రేమికులను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న గ్రామస్థులు.. కట్‌చేస్తే..
మరోవైపు తిరుమలరావు మొదట.. తన భార్యను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈలోగా తేజేశ్వర్‌తో ఐశ్వర్యకు పెళ్లికావడంతోపాటు అతను కర్నూలులో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తిరుమలరావు డబ్బులు సమకూర్చేందుకు ఓ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పనిచేసే బ్యాంకులోనూ అవకతవకలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఐశ్వర్య.. తిరుమలరావుతోపాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆమె చదువుకున్నది పదో తరగతే అయినా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు..