పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. హింస తర్వాత.. ఓ జాతీయ మీడియా బాధిత హిందూ కుటుంబాల వద్దకు చేరుకుంది. అక్కడ పరిస్థితిని ప్రత్యక్ష సాక్షుల ద్వారా…
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని…
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు.
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని స్పష్టం చేశారు.
చేబ్రోల్ కిరణ్‌ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుపడ్డ ఈ కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. "నేను దేశానికి ఎంపీగా పని చేశా.. నేను ఏమైనా దోపిడీ దొంగనా?" అంటు కేకలు వేశారు. గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు.
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం…