తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
అలహాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం జరిగిందని చర్చ జరుగుతోంది. సమావేశంలో ఆయనకు ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్యలో సోఫాలో కూర్చున్నారని బీజేపీ ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ఈ అంశాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. “మొదట ఖర్గే […]
బీహార్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా కలకలం రేగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి(32) 14 ఏళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ 14 ఏళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో నివిస్తున్నారు.
బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం…
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పట్ల హర్యానా ప్రభుత్వం మరోసారి దయ చూపింది. ఇద్దరు భక్తులపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఈయనకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రస్తుతం జైల్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా డేరా సచ్చా సౌదా ఆశ్రమ అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా 13వ సారి జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం, బాబాను పోలీసు రక్షణలో సిర్సా డేరాకు తీసుకువచ్చారు.