భారతదేశంలో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లను జనాలు మెుదట నుంచి ఆదరిస్తున్నారు. తాజాగా గత నెలలో అంటే జూన్ 2025లో మారుతి సుజుకి అత్యధిక కార్లను విక్రయించింది. జూన్‌లో మారుతి సుజుకి మొత్తం 1,18,906 మంది కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది. కాగా.. మారుతి సుజుకి అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం తగ్గాయి. సరిగ్గా ఏడాది కిందట (జూన్ 2024) మారుతి 1,37,160 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది జూన్‌లో 13 శాతం విక్రయాలు తగ్గినప్పటికీ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
READ MORE: Kakatiya University: కాకతీయ వర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.. విద్యార్థుల ఆందోళన
జూన్ నెల అమ్మకాల జాబితాలో మహీంద్రా & మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. మహీంద్రా మొత్తం 47,306 యూనిట్ల కార్లను విక్రయించి, వార్షికంగా 18 శాతం వృద్ధిని సాధించింది. జాబితాలో హ్యుందాయ్ మూడవ స్థానంలో ఉంది. హ్యుందాయ్ మొత్తం 44,024 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే.. 12 శాతం అమ్మకాలు తగ్గాయి. ప్రముఖ దేశీయ కంపెనీ టాటా మోటార్స్ నాల్గవ స్థానానికి పడిపోయింది. ఈ కాలంలో టాటా మోటార్స్ మొత్తం 37,083 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే.. 15 శాతం అమ్మాకాలు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఐదవ స్థానంలో ఉండగా.. JSW MG మోటార్ ఆరు, హోండా ఏడో స్థానంలో నిలిచాయి.
READ MORE: Ather Rizta S: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరి.. 159 కిమీ షురూ.. ఏథర్ రిజ్టా S కొత్త వెర్షన్ లాంచ్!