ప్రతి నెలా ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తూ.. కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. భారత్‌లో అగుడు పెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా కూడా గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మొట్టమొదటి ప్రసిద్ధ కూపే ఎస్‌యూవీ సిట్రోయెన్ బసాల్ట్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీపై మాత్రమే కాకుండా.. C3, EC3, ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు కూడా మంచి ప్రయోజనాలు కల్పించారు.
Read More: Mohan Bhagwat: 75 ఏళ్లకు రిటైర్ రావాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై వివాదం..
సిట్రోయెన్ c3
ఈ కారుపై 1.10 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తోంది. ఈ ఆఫర్ 2025 షైన్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఈ కారుపై కంపెనీ నగదు, లాయల్టీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు ధర 6.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 10.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
సిట్రోయెన్ eC3
కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వాహనంపై 40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ 2023 మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. 2025 మోడల్‌పై ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాహనం ధర 12.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 13.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
సిట్రోయెన్ బసాల్ట్
ఇది కంపెనీకి చెందిన మొట్టమొదటి కూపే ఎస్‌యూవీ. జూలైలో ఈ కారుపై 2.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ప్రయోజనం 2024 Max AT వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ధర 8.32 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 14.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్
ఈ కారుపై 65 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ ప్రయోజనం 2023 మోడళ్లపై మాత్రమే ఉంచారు. 2025 మోడల్ మ్యాక్స్ వేరియంట్‌పై నగదు, ఎక్స్ ఛేంజ్, లాయల్టీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 8 లక్షల 62 వేలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ రూ. 14 లక్షల 60 వేలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు టాటా కార్వ్ తో పోటీ పడుతోంది.