బీహార్‌లోని బెట్టియా నుంచి ఓ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటన జూన్ 30న షికార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై స్పందించిన భర్త ప్రస్తుతం షికార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం.. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు.. భర్త ఇంట్లో లేడు. భర్త పంజాబ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. వారికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. వీరికి ఐదుగురు పిల్లలు. కుటుంబ పోషణ నిమిత్తం బతుకుదెరువు కోసం అతను పంజాబ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. టూమన్ అన్సారీ అనే వ్యక్తితో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడేది. భర్త ఆమెను మందలించిన ఆమె తీరు మారలేదు.
READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ “జాతకం” అంతేనా, ఆ యోగం లేనట్లేనా..
భర్త పంజాబ్‌కి పనికి వెళ్లినప్పుడు.. పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి టూమన్ అన్సారీ బైక్‌పై పారిపోయిందని, తన చెల్లెలిని తనతో పాటు తీసుకెళ్లిందని తెలిపింది. సమాచారం అందిన వెంటనే.. అతను పంజాబ్ నుంచి నార్కటియాగంజ్ ప్రాంతానికి వచ్చి వెతకడం ప్రారంభించాడు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు షికార్‌పూర్ పోలీసులను ఆశ్రయించాడు. టూమన్ అన్సారీ, అతని కుటుంబ సభ్యులు తన భార్యను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారని భర్త ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జ్వాలా కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు గ్రామం నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
READ MORE: Chhangur Baba: హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.