నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తాజా అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలి కాలుష్యం దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే సిగరేట్ తాగడం, ఇతరులు వదిలిన పొగతో పోలిస్తే ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలిలోని నుసి పదార్థం ఎంతవరకు దోహదం చేస్తోందనేది తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఊపిరితిత్తి క్యాన్సర్ అనేది కేవలం పొగతాగేవారికే వచ్చే జబ్బుగా పరిగణించేవాళ్లం. కానీ తాజా అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను పరిశీలిస్తే.. ఈ క్యాన్సర్ అనేది పొగ తాగే అలవాటు లేని వారికి కూడా ఎక్కువగా వస్తున్నట్లు కానిపిస్తుంది.
దానికి కారణాలు గమనిస్తే.. పొగతాగని వారిలో ఊపిరితిత్తి క్యాన్సర్ రావడానికి ఎక్కువగా పర్యావరణ అంశాలు కారణంగా నిలుస్తున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తాజా అధ్యయనంలో బహిర్గతం అయ్యింది. వాయు కాలుష్యానికి ఎంత ఎక్కువగా గురైతే అంత ఎక్కువగా ఊపిరితిత్తి కణితి డీఎన్ఏలో మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తి క్యాన్సర్‌తో ముడిపడిన డీఎన్ఏ మార్పులకూ ఆరుబయట నుసి పదార్థ ప్రభావానికీ బలమైన సంబంధం ఉంటున్నట్టు విస్తృత జన్యు అధ్యయనంలో తేలిందలని పేర్కొన్నారు. గాలి కాలుష్యం అధికంగా ఉండే ప్రదేశాల్లో ఉంటున్న జనాభాలో టీపీ53, ఈజీఎస్ఆర్ మార్పులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిలో ఎస్బీఎస్4 ముద్రలు నాలుగు రెట్లు అధికంగా బయటపడినట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్యంతో నేరుగా ఊపిరితిత్తి క్యాన్సర్ వస్తుందని చెప్పలేమని, క్యాన్సర్ తలెత్తడానికి కారణం అవుతున్నట్లు మాత్రం ఫలితాలు సూచిస్తున్నట్లు వెల్లడించారు. ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలిలోని నుసి పదార్థం ఎంతవరకూ దోహదం చేస్తోందనేది తాజా అధ్యయనంలో జన్యుమార్పుల ఆధారంగా వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
READ MORE: Joe Root: టెస్టుల్లో జో రూట్ చరిత్ర.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బ్రేక్!