టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే కథ చెప్పానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.
శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం…
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..