Heart Attack: ఇటీవల.. రాజస్థాన్‌లోని సికార్ నుంచి విచారకరమైన వార్త వచ్చింది. 9 ఏళ్ల బాలిక పాఠశాలలో గుండెపోటుతో మరణించింది. ఈ బాలిక 4వ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ స్పందించారు. “పాఠశాల భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగింది. మాట్లాడుతూ, పిల్లలందరూ తమ తరగతి గదుల్లో ఆహారం తింటున్నారు. ఈ బాలిక టిఫిన్ బాక్స్ తెరుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: NIMS: నిమ్స్ అరుదైన రికార్డ్.. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడీ సర్జరీలు పూర్తి
నవీ ముంబైలోని మెడికోవర్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రిషి భార్గవ, పిల్లలకు గుండెపోటు ఎందుకు వస్తుందో వివరించారు. దాని లక్షణాలు ఏమిటో తెలిపారు. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా గుండెపోటు వస్తుందని రిషి భార్గవ వెల్లడించారు. ఇది చాలా అరుదు. అయితే, ఇటీవల కొంతమంది పిల్లలలో ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయన్నారు. దీనికి కొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చని తెలిపారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఎప్పుడు?.. పవన్ కళ్యాణ్ క్లారిటీ!
పిల్లలలో గుండెపోటుకు కారణాలు:
పుట్టుకతో వచ్చే గుండె లోపం : పుట్టినప్పటి నుంచి గుండెలో ఏదైనా లోపం.
వైరల్ ఇన్ఫెక్షన్: గుండెను ప్రభావితం చేసే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ (మయోకార్డిటిస్ వంటివి).
కవాసకి వ్యాధి : రక్త నాళాలు వాచిపోయే వ్యాధి.
కొలెస్ట్రాల్ రుగ్మతలు: కొలెస్ట్రాల్ సమస్యల కుటుంబ చరిత్ర (హైపర్ కొలెస్టెరోలేమియా వంటివి).
COVID-19 సమస్యలు : COVID-19 (MIS-C వంటివి) నుంచి వచ్చే వాపు లేదా సమస్యలు కూడా పిల్లల హృదయాలను ప్రభావితం చేస్తాయట.
READ MORE: Pawan Kalyan: రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు సవాల్
పిల్లలలో గుండెపోటు లక్షణాలు :
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
త్వరగా అలసిపోవడం.
వాంతులు (వికారం) వస్తున్నట్లు అనిపించడం.
తల తిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోయినట్లు అనిపిస్తుంది.
పెదవులు, చర్మం నీలిరంగు రంగు మారడం.