Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో ట్రంప్ చేతులు, కాళ్ళపై వాపు కనిపిస్తోంది. దీంతో వివిధ రకాల ఊహాగాణాలు మొదలయ్యాయి. దీని గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ దీర్ఘకాలిక వీనస్ ఇన్సఫిసియెన్సీ అనే సిర వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయన చేతులు, పాదం మెడమ (చీలమండలం) భాగంలో స్వల్ప వాపు వచ్చిందని.. వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ వ్యాధి బయటపడిందని వెల్లడించారు. పరీక్షలో ఆయనకు దీర్ఘకాలిక సిరల లోపం అనే వ్యాధి ఉంది. అయితే, ఇది సిర త్రాంబోసిస్ లేదా ధమనుల వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు. ఈ వ్యాధి వృద్ధాప్యంతో వచ్చే సాధారణ సమస్య.70 ఏళ్ల సిరల లోపం సాధారణం. ఈ వయస్సులో సిరల్లో రక్త ప్రవాహం తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే.. ట్రంప్ నిరంతరం చేతులు వణుకుతూ ఉండటం, ఆస్పిరిన్ వాడటం వల్ల వయస్సుతో పాటు ఈ సమస్య ఉండవచ్చని చెబుతున్నారు.
READ MORE: Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ రాజీనామా.. ఆ 305 నిమిషాల్లో ఏం జరిగింది..?
దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి?
కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ (కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్) క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఈ వ్యాధిపై వివరణ ఇచ్చారు. “దీర్ఘకాలిక సిరల లోపం అనేది రక్త ప్రసరణ ప్రభావితమయ్యే పరిస్థితి. కాళ్ళ సిరల కవాటాలు సరిగ్గా పనిచేయలేకపోవడం వల్ల రక్తం గుండె వైపు వెళ్లడానికి బదులుగా కాళ్ళలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల కాళ్ళు, మెడిమ భాగంలో వాపు వస్తుంది. పెరిగిన వాపు కారణంగా కాళ్ళలో బరువు, నొప్పి, ఎరుపు లేదా చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇది వయస్సు పెరుగుతున్న కొద్దీ సంక్రమించే వ్యాధి.” అని వెల్లడించారు.