Renault Triber Facelift Price & Features: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చౌకైన 7 సీటర్ కారు ‘రెనాల్ట్ ట్రైబర్’కి చెందిన కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ కాంపాక్ట్ ఎంపీవీకిని కొత్తగా తీర్చిదిద్దారు. గతంలో ఈ కారును చిన్న చిన్న మార్పులతో విడుదల చేశారు. ప్రస్తుతం ‘రెనాల్ట్ ట్రైబర్’ నూతన వేరియంట్ ఆకర్షణీయమైన లుక్స్, అధునాతన ఫిచర్లతో వస్తోంది. దీని ధరను రూ. 6.29 లక్షల నుంచి రూ. 8.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య నిర్ణయించారు. ఈ కారును కంపెనీ మొత్తం 4 వేరియంట్లతో మార్కెట్లో విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ఆథెంటిక్ ధర రూ. 6.29 లక్షలు. ఇందులో కొన్ని ప్రాథమిక ఫీచర్లు ఇవచ్చారు. రెండవ వేరియంట్ ఎవల్యూషన్ ధర రూ. 7.24 లక్షలు, మిడ్ వేరియంట్ టెక్నోలో మరికొన్ని ఫీచర్లు అందించారు. దీని ధర రూ. 7.99 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ. 8.64 లక్షలుగా కంపెనీ నిర్ధారించింది. కొత్త అప్‌డేట్‌లు, ఫీచర్లతోపాటు కారు ధర స్వల్పంగా పెరిగింది.
READ MORE: Paraspeak: ఇండియన్ విద్యార్థి సంచలన సృష్టి.. డిసార్థ్రియా రోగులకు కొత్త ఆశ
రెనాల్ట్ ట్రైబర్ డిజైన్..
డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. కారు ముందు భాగం కొత్త లుక్‌తో వస్తోంది. హెడ్‌లైట్‌ల కోసం కొత్త డిజైన్ అందించారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లు మరింత ఆకర్షణీయంగా మార్చాయి. కంపెనీ ఈ కారును కొత్త లోగో, కొత్త ఫ్రంట్ గ్రిల్‌తో పరిచయం చేసింది. బంపర్ డిజైన్ కూడా మారింది. రెండు వైపులా సిల్వర్ సరౌండింగ్, ఫాగ్ ల్యాంప్‌లు అమర్చారు. ఈ ఎస్‌యూవీలో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్‌కు బదులుగా గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్‌ను అందించారు. వెనుక భాగంలో స్మోక్డ్ ఎల్‌ఈడీ టెయిల్-లైట్‌లతో పాటు కొత్త బ్లాక్-అవుట్ ట్రిమ్ జోడించారు.
READ MORE: Air India Crash: యూకేలో బాధిత కుటుంబాలకు రెండు తప్పుడు మృతదేహాలు..
కొత్త ట్రైబర్‌లో కంపెనీ పూర్తిగా కొత్త తరహా క్యాబిన్ ను అందించింది. క్యాబిన్‌లో అనేక మార్పులు చేసింది. బ్రాండ్ ఈ కారులో కొత్త లోగోతో స్టీరింగ్ వీల్‌తో కొత్త లేఅవుట్‌ను పరిచయం చేస్తోంది. క్యాబిన్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చారు. క్రూయిజ్ కంట్రోల్, ఆటో వైపర్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో ఫోల్డ్ అవుట్ రియర్ వ్యూ మిర్రర్లు (ORVMలు) వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. భద్రతా విషయానికి వస్తే.. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి.
READ MORE: Fake FB Account: తెలంగాణ బీజేపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. శ్రేణుల్లో గందరగోళం..!
ఇంజిన్, పనితీరు..
ఈ కారు ఇంజిన్ మెకానిజంలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ కారులో మునుపటిలాగే 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తోంది. ఈ ఇంజన్ 72 hp పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ కిగర్ ఎస్‌యూవీలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) తో జతచేశారు. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో రెనాల్ట్ కొన్ని కొత్త ఇంజిన్ ఎంపికలను అందించి ఉంటే బాగుంటుందని చెబుతున్నారు.