స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివని.. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమైన కావాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. పోటీచేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు.. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కొట్లాడుతాం.. అభ్యర్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ హామీలు, మోసాలు చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతామన్నారు. బాల్కొండలో పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ దారుణమని.. రేషన్ కార్డులు ఇవ్వటం గొప్ప పని కాదు.. అది ప్రభుత్వం బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.
READ MORE: HHVM : పవన్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్లు.. వీరమల్లులో అవే హైలెట్..
మల్కాజిగిరి లో ఇద్దరు కాంగ్రెస్ గుండాలు ప్రవర్తనకు బుద్ది చెప్తామని కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తే.. కాంగ్రెస్ గూండాలు లైన్ లోకి వస్తారన్నారు. “ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ. ఆరు గ్యారంటీల్లో. మూడు మోసాలను ప్రజలకు వివరించాలి. ఒక్కో ముసలమ్మకు రేవంత్ ప్రభుత్వం 40వేల బాకీ ఉంది. పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు. నాట్లు అప్పుడు కాకుండా.. ఓట్లు అప్పుడు రైతుబంధు వేసి సంబురాలు చేసుకోమంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక.. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవనీయం. ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో ప్రజలకు అర్థమైంది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి పార్టీకి సమ న్యాయం చేస్తాం.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Palnadu Crime: చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు.. తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య