PM Modi- Indira Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. నేటితో (జూలై 25, 2025) ఆయన 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును అధిగమించారు. ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డుకెక్కారు. ఇదిలా ఉండగా.. మోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని ప్రారంభించారు. రాష్ట్రం, కేంద్రం రెండింటిలోనూ దాదాపు 24 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించారు. ఈ ఘనత ఇప్పటివరకు మరే ఇతర భారత ప్రధానమంత్రి పేరు మీద లేదు. మోడీ రాజకీయ ట్రాక్ రికార్డ్‌లో వరుసగా మూడు జాతీయ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించారు. ఈ ఘనత గతంలో జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు. ఇంతే కాదు ఇంకా చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. అవేంటో చూద్దాం..
READ MORE: Air India Crash: బోయింగ్ ఇంధన వ్యవస్థలో లోపం లేదు.. యూఎస్ ఏవియేషన్ సంస్థ..