శ్రావణ మాసంలో పామును చూడటం శుభప్రదంగా భావిస్తారు. కానీ పెద్ద సంఖ్యలో పాములు కనిపిస్తే అది భయంతో వణుకు వస్తుంది. తాజాగా బీహార్‌లోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఒక ఇంట్లో 60 కి పైగా నాగుపాములు కనిపించడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. డజన్ల కొద్దీ పాములు కనిపించడం ఆ ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
READ MORE: Landmine Blast: జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
వినోద్ యాదవ్ తన కుటుంబంతో కలిసి బాగాహా ప్రాంతంలోని లక్ష్మీపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతని ఇల్లు గ్రామం చివరలో ఉంది. తన ఇంట్లో ఒక గది చాలా కాలంగా మూసి ఉంది. అందులో పశువుల దాణా మొదలైనవి ఉంచేవారు. ఆ గది నుంచి గత కొన్ని రోజులుగా.. రోజూ రాత్రి భయానక శబ్ధాలు వినిపించాయి. మొదట్లో, దానిని పట్టించుకోలేదు. కానీ శబ్దాలు పెరుగుతుండటంతో అది ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ గది తలుపు తెరిచి లోపలికి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. భయపడి సమీపంలోని గ్రామస్థుల వద్దకు పరుగులు తీశాడు. తన గదిలో పెద్ద మొత్తంలో నాగు పాములను చూశానని వినోద్ గ్రామస్థులకు చెప్పాడు.
READ MORE: RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలి.. మాజీ మంత్రి డిమాండ్..
దీంతో కొంతమంది ధైర్యం చేసి అతనితో పాటు అతని ఇంటికి వెళ్లారు. ఇంటి లోపలికి వెళ్ళగానే పాముల గుంపు కనిపించింది. వాళ్ళు దీన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పాములవాడికి ఫోన్ చేశారు. ఆ గదిలో ఓ బొరియను కనుగొన్నారు. దీన్ని తవ్వి చూడగా, లోపల విషపు పాముల గుంపు కనిపించింది. 60 కి పైగా పాములు బయటపడ్డాయి. వాటిని సురక్షితంగా అడవిలో వదిలేశారు. ఈ ఘటన తర్వాత, వినోద్ యాదవ్ కుటుంబం ఇంట్లోకి వెళ్లాలంటే భయపడుతోంది. చుట్టుపక్కల ప్రజల్లో కూడా భయం వాతావరణం నెలకొంది. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని, కానీ ఇంత పెద్ద సంఖ్యలో నాగు పామును ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.