Basavatarakam Hospital Amaravatiరేపు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నారు.. తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్యలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి 21 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. రేపు ఉదయం 9:30 గంటలకు బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో తెలిపారు.
READ MORE: Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?
మరోవైపు అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దీనిని వేయి పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అప్పట్లోనే ప్రభుత్వం ఇందుకు భూమి కేటాయించింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. అధికారంలోకి రావటంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోనూ ఒక ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.