Former minister Ambati Rambabu alleges: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడూ జరగనంత ఘోరంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2017లో నంద్యాల కంటే దారుణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని.. దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా మా నేతలు వివరాలు తెలిపారన్నారు.. పోలీస్ యంత్రాంగం వైసీపీ నేతలను బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు.. మా పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం తిప్పారని మండిపడ్డారు.. ఇవాళ ఖాకీ దుస్తులు వేసుకున్న సంగతి మర్చిపోయి టీడీపీ ఏజెంట్ లా ఎన్నిక జరిపే కార్యక్రమం డీఐజీ కోయా ప్రవీణ్ చేపట్టారని ఆరోపించారు. ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా..? అని ప్రశ్నించారు.
READ MORE: Indus Waters Treaty: భారత్‌కు పాక్ వార్నింగ్.. సింధూ జలాల కోసం చిల్లర హెచ్చరికలు!
పోలీసులు దొంగ ఓట్లు వేసే వాళ్లను అడ్డుకోకుండా వీళ్ళే తీసుకువెళ్లి వేయిస్తున్నారు.. పులివెందుల వైసీపీ కార్యాలయంలో అవినాష్ రెడ్డి కూర్చుంటే స్వయంగా డీఐజీ వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. మరో డీఎస్పీ నానా దుర్భాషాలు ఆడారని.. కార్యాలయం బయట ఉన్న జనాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. మీరు ఖాకీలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి రాజకీయాలు చూడలేదని విమర్శించారు.. మీరు తీసుకువచ్చిన సంస్కృతి మిమ్మల్ని, మీ కొడుకును వెంటాడదా..? అని నిలదీశారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.. మీకు ఓటేసిన వాళ్లకు చంద్రబాబు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా..? అన్నారు.
పోలీసులే ఎన్నికలు చేసే దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు.
“సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు విచ్చలవిడిగా పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చేసుకునేందుకు అవినాష్ రెడ్డిని అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు దగ్గర శెభాష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్న డీఐజీ కోయా ప్రవీణ్.. దీనికి తప్పనీ సరిగా మూల్యం చెల్లించుకోకతప్పదు.. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే మా ఓటు మాకు ఇప్పించండి అని జనం ఎందుకు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు.. మహిళలు తమ ఓట్ల కోసం ధర్నాలు చేస్తున్నారు.. అక్కడేం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తున్నారు.. జమ్మలమడుగు వైస్ చైర్మన్ వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్ళారు.. వైసీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేసి పోలీసుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేసుకున్నారు..” అని మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.