Jagtial Village Caste Exclusion: దేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేశ్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేషోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటికాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి, స్వాతంత్ర్యంపై అవగాహనను పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కూడా గణేష్ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలిచారు. కానీ.. జగిత్యాల జిల్లాలో ఈ అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. ఉత్సవాలను డబ్బులతో ముడిపెట్టారు. డబ్బులు ఇవ్వకపోవడంతో అమానుష ఘటనకు పాల్పడ్డారు.
READ MORE: IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్!
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని కుల(SC) పెద్దలు గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగ లచయ్య, అంజి, సూర్య వంశీల నాలుగు కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుల్లతో దండోర వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25 వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. ఆ కుటుంబాలతో అ కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5 వేల నజరానా ప్రకటించారు.
READ MORE: IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్!
భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే రూ. 1,116 ఇచ్చిన తర్వాతే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసింది. కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు, బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారితీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
READ MORE: సరసమైన ధరలలో ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో Oppo A6 GT, A6i విడుదల!