Odisha: ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 117 మంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశా స్టేట్ ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టయింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాను తీసుకెళ్తున్న ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకైన పేపర్‌ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు, ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు బస్సుల్లో వెళ్తున్నట్లు ఒరిస్సా పోలీసులు సమాచారం అందింది. దీంతో ఎచ్చర్ల వద్ద మూడు బస్సులను తనిఖీ చేసిన శ్రీకాకుళం పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను ఒరిశా పోలీసులకు అప్పగించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షలు డీలింగ్ కుదిరినట్లు సమాచారం. రూ.10 లక్షలు ముందుగానే చెల్లించాలి. ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం కుదిరింది.
READ MORE: YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..
Also Read
పోలీసుల కథనం ప్రకారం.. బెర్హంపూర్ పోలీసు బృందానికి రహస్య సమాచారం అందింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు ఎసీ స్లీపర్ బస్సులను అడ్డగించారు. భువనేశ్వర్‌లోని బారాముండా బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సుల్లో 117 మంది ప్రయాణికులు ఉన్నారు. విచారణలో వారిలో 114 మంది సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్షకు అభ్యర్థులు అని, భారీ నెట్‌వర్క్ కలిగిన ముగ్గురు ఏజెంట్ల సహాయంతో ప్రయాణిస్తున్నారని వెల్లడైంది. వాస్తవానికి.. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి భువనేశ్వర్ తిరిగి వచ్చే ముందు విజయనగరంలో రహస్య ప్రశ్నాపత్రాలను పొందేందుకు కుట్ర పన్నారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!