Andhra Pradesh GST: ఏపీలో సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నికర జీఎస్టీ వసూళ్లలో 7.45 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,789 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ శకం ఆరంభమయ్యాక ఆంధ్రప్రదేశ్ రెండోసారి అతి పెద్ద స్థూల రాబడి నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లలోనూ 4.19 శాతం వృద్ధి సాధించింది. ఈ సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లకు చేరుకున్నాయి. ధరల తగ్గింపు ప్రకటనల నేపథ్యంలో కొనుగోళ్ల లావాదేవీలు తగ్గినప్పటికీ పన్నుల రాబడిలో వెనుకబడలేదు. రాష్ట్ర జీఎస్టీ రాబడిలోనూ 8.28 శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఏడాది ఈ నెలతో పోల్చితే రాబడి గణనీయంగా పెగిరింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.1,380 కోట్ల రాబడితో 3.10 శాతం వృద్ధి నమోదు చేసింది. పన్నుల వసూళ్లలో సాంకేతికత సాధించింది. కాగా.. వాణిజ్య పన్నుల శాఖ కృత్రిమ మేథ, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఆటోమేషన్, డేటా డ్రైవన్ ఓవర్‌సైట్ మెకానిజమ్ లాంటి విధానాలు ప్రవేశపెట్టింది.
READ MORE: Meesala Pilla: ఈ మీసాల పిల్ల స్లో పాయిజన్ లా ఉందే !
మరోవైపు.. సెప్టెంబర్ 2025లో GST స్థూల వసూళ్లు ₹1.89 లక్షల కోట్లకు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్ లో ₹1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST వసూళ్లు ₹1.80 లక్షల కోట్లను దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. సెప్టెంబర్ వసూళ్లలో ఈ బలమైన పెరుగుదల ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 22, 2025న అమల్లోకి వచ్చిన GST సంస్కరణల తర్వాత జీఎస్టీ వసూళ్లలో పెరుగదల నమోదైంది.