Jagtial District: కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇక్కడ మాత్ర సీన్ రివర్స్ అయ్యింది. కర్కోటకుడిగా మారిన కొడుకు కన్న తండ్రినే దారుణంగా పొడిచేశాడు. 10 గుంటల భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తండ్రీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది..
TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు పెట్టనున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
Fake Apple Products: ఐ ఫోన్...! ఇది మొబైల్ ఫోన్ కాదు... ఓ స్టేటస్ సింబల్ !! లక్ష రూపాయల విలువైన వేరే మోడల్ ఫోన్ వాడుతున్నా... 50 వేల ఐ ఫోన్ ఉంటేనే గొప్ప !! కనీసం చేతికి యాపిల్ వాచ్ ఐనా ఉండాలి.. అని ఫీల్ అయ్యే వారినే టార్గెట్ చేసిందో ముఠా.
Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది. ఈ సంస్థకు చెందిన బ్రోకర్లు రంగంలోకి…
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.