Dharmasthala Case: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారు.
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించనుంది…
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకం వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి, వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో దీని గురించి సమాచారం ఇచ్చారు.
ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగోలేక రుణ వాయిదా(ఈఎంఐ) చెల్లించలేదు. దీంతో ఆ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల చేసిన దారుణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఓ వ్యక్తి ఈఎంఐ చెల్లించలేదని అతడి భార్యను తీసుకెళ్లారు. వాయిదా చెల్లించి భార్యను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల వద్ద బందీగా ఉన్న భార్యను పోలీసులు విడిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మనలో చాలా మంది కొన్ని అవసరాలకు గాను ప్రభుత్వ అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతుంటారు. అందుకు కొన్ని నియమ నిబంధనలతోపాటు నిర్దిష్ట ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ.. ఇటీవల కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. అయితే తాజాగా అదే బీహార్ రాష్ట్రం నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి ‘డాగేష్ బాబు’ అనే పేరున్న మరో కుక్క ఫొటోతో నివాస పత్రానికి దరఖాస్తు వచ్చినట్లు…
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. నగదు లెక్కింపు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపడుతున్నారు.. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఈడీ అదుపులోకి తీసుకుంది. కళ్యాణ్ ఇంట్లో సోదాలు అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తోకలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. రూ. 700…
Mumbai Encounter Specialist Daya Nayak: ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ దయా నాయక్ పదవీ విరమణకు 48 గంటల ముందు ఆ శాఖ పదోన్నతి కల్పించింది. మహారాష్ట్ర పోలీస్‌లో ప్రసిద్ధి చెందిన దయా నాయక్ ఇప్పుడు ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)గా పదోన్నతి పొందారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. మంగళవారం పదోన్నతి పొందిన దయా నాయక్ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ముంబై పోలీసులు మహారాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ పరిధిలోకి వస్తారు.
Hyderabad: ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నారు. ఇక్కడ అబ్బాయి సీరియస్‌గానే ప్రేమించాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తితో ప్రేమాయణం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని పిచ్చి ప్రేమికుడు కన్నవాళ్ల గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ రామంతాపూర్ లో అమ్మాయి మోసం చేసింది అని చక్రపాణి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.