రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయ్ ఉత్సవానికి నిదర్శనమన్నారు.. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్.. విజయ్ ఉత్సవ్‌ను దేశం మొత్తం జరుపుకుంటోందని వెల్లడించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు ప్రసంగించారు. కేంద్రంపై తీవ్ర విమర్శలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ను ప్రభుత్వం నిర్వహించిన తీరుపై పదునైన ప్రశ్నలను సంధించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని సవాల్ విసిరారు. "డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపానని 29 సార్లు చెప్పారు. ఇది నిజం కాకపోతే.. ప్రధాని ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించాలి.
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.
Jagan Nellore Visit: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 31వ తేదీన (గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ ఇప్పటికే పోలీసులు నోటీసులు అందించారు. తాజాగా జగన్ జిల్లా పర్యటనపై నెల్లూరు ఇన్‌ఛార్జి ఎస్పీ దామోదర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జన సమీకరణ చెయ్యడం లేదని వైసీపీ నేతలు చెప్పారన్నారు. హెలిపాడ్ వద్ద 10 మందికే అనుమతి ఇచ్చామన్నారు.
రాష్ట్ర ప్రగతిలో అందర్నీ భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 60 శాతం రైస్ కార్డులకు సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని..
AP Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. త్వరలో ఉచిత బస్సు పథకానికి మంచి పేర్లు పెడతామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతోంది.. ఆయా రాష్ట్రాల్లో అమలువుతున్న విధంగానే ఏపీలోనూ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి ముఖ్యమైన పథకమన్నారు. అన్ని పథకాల […]
ఆపరేషన్ సిందూర్ పై నేడు లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ మహాదేవ్ లో పహల్గామ్ నిందితులను సైన్యం హతమార్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. హతమైన ఉగ్రవాదులకు సంబంధించి ఆధారాలకు సభకు తెలిపారు. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో కొన్ని ప్రశ్నలు సంధించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గామ్ సంఘటనను నిఘా వైఫల్యం అని స్పష్టం చేశారన్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. 7 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,59,116 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,55,811 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేశారని ఆరోపించిందని తెలిపారు.