Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘రాకా’. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు ఎలాంటి విరామం లేకుండా ఒకే ప్రాంతంలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటూ టాలీవుడ్లోనే ఒక రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్ విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ సౌండ్ స్టేజ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ షూట్ ముందు దుబాయ్, ఇతర అంతర్జాతీయ లొకేషన్లలో ప్లాన్ చేసినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా ఆ షెడ్యూళ్లను రద్దు చేయడం జరిగింది. దీంతో మేకర్స్ తమ పూర్తి దృష్టిని ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌పైనే పెట్టి నాన్‌స్టాప్‌గా షూట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బన్నీ కేవలం చిన్నపాటి విరామాలు మాత్రమే తీసుకుంటూ నిరంతరాయంగా ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కూడా తన భాగానికి సంబంధించిన షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ముంబై సెట్లో సాగుతున్న ఈ భారీ షెడ్యూల్ మరో నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా సాగనుంది. ఈ చిత్రాన్ని 2027లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!