Back Pain: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అయితే.. నడుంనొప్పికి రకరకాల కారణాలే ఉండొచ్చు. ఇది తరచూ తిరగబెడుతుంటుంది కూడా.
Viral News: ఓ 16 సంవత్సరాలుగా ఉద్యోగం చేయకుండానే 11 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు. ఇప్పటికీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన జర్మనీలో జరిగింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 2009 నుంచి.. అంటే 16 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు.
Natural Drinks to Cleanse Your Liver: కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి.
High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి.
CM Revanth Reddy: భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి వరద అక్కడికి చేరుకున్నారు. వరద బాధితులను కలిసి పరామర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Karimnagar: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల జేఏసీ, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి వెలిశాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు, ఎస్సీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు నేతలు ఆరోపించారు. జిల్లాలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటోలు ఫ్లెక్సీలలో ముద్రించడం లేదని…
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని... కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్) ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే.. ఆ రెండు పార్టీ లు అన్నదమ్ములు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలలుగా జీతాలు లేక ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా మాధవరావుపల్లి కి చెందిన మైదం మహేష్(34).. ములుగు గ్రామ పంచాయతీలో ఔట్సోర్సింగ్ డైలీ లేబర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా జీతం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఏం చేయాలో తోచక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మహేష్..
హైదరాబాద్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. డ్రగ్స్ సేవిస్తున్న పది మందిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతో పాటు 8 మంది ట్రాన్స్‌జెండర్ (గే) కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీ ఎంఎస్ స్వాధీనం చేసుకున్నారు. Grinder అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ట్రాన్స్జెండర్లు (గే) సైతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
గత వారం చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్దపెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్‌ల్లో వేదికల వద్దకు చేరుకొంటారు. కానీ, తింజియన్లోని షాంఘై సహకార సదస్సులో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో బయల్దేరి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఇద్దరూ దాదాపు 45 నిమిషాలు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కానీ.. వీరి భేటీలో ఏ అంశంపై చర్చించారో…