-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్.. ఒకప్పుడు కేవలం వన్డే స్పెషలిస్ట్ అనిపించుకున్న ఈ పేరు, ఇప్పుడు టీ20 ఫార్మాట్లో నిలకడకు నిలువెత్తు రూపంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, ఫినిషర్‌గానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు శ్రేయస్. అయితే, ఈ అద్భుత పరివర్తన వెనుక అయ్యర్‌ను కలిచివేసిన అవమానాలు, విమర్శలు ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశం. తనపై వచ్చే విమర్శలనే ఇంధనంగా మార్చుకుని తనను తాను నిరూపించడమే తన లక్ష్యమని అయ్యర్ స్పష్టం చేశాడు. -
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
Fuel Shortage: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అధికార వర్గాలు తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి బంకుల ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం, చమురు… -
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
CM Revanth Reddy: న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని న్యాయ… -
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
Bhuvneshwar Kumar: సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ, టీమ్ ఇండియా ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో సంచలనం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల గణాంకాలను […] -
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
Virat Kohli Creates History With 9000 IPL Runs: ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ లీగ్ చరిత్రలో కనీసం 8000 పరుగుల మార్కును సైతం ఎవరూ చేరుకోలేకపోయారు. కానీ కోహ్లీ ఏకంగా 9000 పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుని తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చరిత్ర సృష్టించాడు.… -
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
Petrol Diesel Shortage: హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెళిశాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Wasim Jaffer: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజాం, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే వాదనలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం ఆటతీరుపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబర్ నిస్సందేహంగా మంచి ఆటగాడే అయినప్పటికీ, అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం ఏమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనవసర పోలికలే బాబర్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణమని జాఫర్ విశ్లేషించారు.… -
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
Dharmapuri Arvind: కవిత కొత్త పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది అన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు వాళ్లను ఓడించి బీజేపీని గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అని చెప్పారు. బీజేపీ సపోర్ట్ లేకండానే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇటీవల ఎంపీ తేజస్వీ యాదవ్ పార్లమెంట్లో తెలంగాణ విభజన అంశంపై మాట్లాడిన తీరును అరవింద్ వివరించారు. ఇండియా- పాకిస్థాన్ ప్రక్రియలో… -
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
RCB: చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మ్యాచ్ గెలిచినప్పటికీ.. ఐపీఎల్లో ఓ అవాంఛనీయ రికార్డును ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సెంచరీలు సమర్పించుకున్న జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఏకంగా 15 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్… -
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
Ramchander Rao: కల్వకుంట్ల కవిత నేడు తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పార్టీ పేరు ప్రకటించారు. ఇక కవిత కొత్త పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.. అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు. “గతంలో టీఆర్ఎస్.. […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?