Election Commission: దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. వీరిలో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘంపై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పదే పదే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు.
READ MORE: Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
భారతదేశ ప్రజాస్వామ్యం బాహ్య దాడి కాదు.. విషపూరిత రాజకీయ వాక్చాతుర్యంతో సవాలు చేస్తున్నారని బహిరంగ లేఖ పేర్కొన్నారు. లేఖ ప్రకారం.. ప్రతిపక్షానికి ఈసీ వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ఎటువంటి అధికారిక ఫిర్యాదు లేదా అఫిడవిట్ దాఖలు చేయడం లేదు. ఆరోపణలు కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమే.. ఇవి ఎప్పటికీ నిజం కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ఉదహరించారు. రాహుల్ గాంధీ ఇటీవల “ఓట్ చోరీ”కి అంశాన్ని లేవనెత్తారు. “అణుబాంబు” పేలనుందని ప్రకటన చేశారు. ఇటువంటి ప్రకటనలు ఎన్నికల కమిషన్ అధికారులను బెదిరించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తాయని లేఖలో రాసుకొచ్చారు. లేఖలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “EC SIR ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించింది. కోర్టు పర్యవేక్షణలో ధృవీకరణ నిర్వహించింది. బోగస్ ఓటర్లను తొలగించింది. కొత్త అర్హత కలిగిన ఓటర్లను చేర్చింది. అందువల్ల.. ఈసీని “బీజేపీ B-టీమ్” అని పిలవడం రాజకీయం చేయడం మాత్రమే.. రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈసీపై విమర్శలు మాయమవుతాయి. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు కమిషన్‌ను “విలన్”గా మారుస్తారు. ఇది దౌర్జన్యం రాజకీయ అవకాశవాదాన్ని బహిర్గతం చేస్తుంది.” అని లేఖలో పేర్కొన్నారు.
READ MORE: 43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?
ఈసీపై ఆరోపణలకు విదేశీ వేదికలను సైతం వాడుకున్న రాహుల్‌గాంధీ..
కాగా.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. ఇందుకు గానూ విదేశీ వేదికలను సైతం ఆయన వాడుకున్నారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. ఇటీవల బీహార్ ఎన్నికలకు ముందు కూడా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.