Mahbubnagar Tragedy: మహబూబ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవన పోరాటంలో అలసిపోయిన ఓ తండ్రి.. మృతిచెందిన తన కుమారుడికి అంత్యక్రియలు సైతం చేసే దుస్థితి లేక.. కొట్టుమిట్టాడుతున్న ఘటన కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
READ MORE: PM Svanidhi Yojana: డబ్బులు కావాలా?.. హామీ లేకుండానే రూ.90,000 పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
బాలరాజు అనే వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తూన్నాడు. తన భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగించాడు. పెద్ద కుమారుడు హరీష్(8) దివ్యాంగుడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడి బాలరాజు ఉపాధి కోల్పోయాడు. దీంతో అతడి భార్య దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది. బాలరాజు స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తూ వచ్చాడు. కానీ విధి మరో దెబ్బ కొట్టింది. తీవ్రమైన అనారోగ్యంతో ఎనిమిదేళ్ల హరీష్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకును కంటికి రెప్పలా చూసుకున్న తండ్రికి ఇది భరించలేని బాధ. అయినా కన్నీరు ఆపుకొని కనీసం అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించాడు. కానీ అతని దగ్గర ఒక్క రూపాయి లేదు. ఎవరూ సాయం చేయలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని స్మశానంలో ఎనిమిది గంటలపాటు అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాడు ఆ తండ్రి.. “బ్రతున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను” అని విలపించాడు.