Mallojula Venu Gopal: మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణు గోపాల్ మరో వీడియో విడుదల చేశారు. “మావోయిస్టులు లోంగిపోవాలని కోరుతున్నా.. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది.. ఎన్ కౌంటర్‌లో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.. హిడ్మాతో పాటు మావోలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.. మావోలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. అందుకే మావోలు లోంగిపోవాలని కోరుతున్నా.. లోంగిపోవాలనుకునేవాళ్లు నాకు ఫోన్ చేయండి.. నా నంబర్ 8856038533..” అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు విడుదల చేశారు.
READ MORE: Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
ఇదిలా ఉండగా.. ఇటీవల మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటు చోటుచేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్ భూపతి అలియాస్ సోను ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్ తలపై రూ.6 కోట్ల రివార్డుంది. ఆయనతో కలిసి 60 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారు. వారంతా 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అందులో ఏకే-47లు, ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్లాటూన్ ఆపరేషన్లను నిర్వహించడంతోపాటు మావోయిస్టుల వ్యూహకర్తగా మల్లోజుల వ్యవహరించారు. రెండ్రోజుల కిందే వీరంతా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు.
READ MORE: Top Maoist Leader Devji Killed: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ మృతి..!