Raja Singh: రాజమౌళి ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో భాగంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోందన్నారు.. తన అమ్మానాన్నలకు హనుమంతుడిపై విశ్వాసం ఉంది కానీ.. తనకు లేదని రాజమౌళి అన్న మాటలను రాజాసింగ్ గుర్తు చేశారు. నీకు విశ్వాసం లేదు కానీ.. అదే ధర్మం, దేవుళ్లపై సినిమాలు చేసి.. రూ. కోట్లల్లో సంపాధించుకున్నావు కదా..? అని ప్రశ్నించారు. అసలు నీ ప్లాన్ ఏంది..? ఇప్పుడు వారణాసి పేరుతో మహేష్‌బాబును పెట్టి మరో సినిమా తీస్తున్నావ్.. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశావా? అని నిలదీశారు. లేదా నువ్వు నిజంగానే నాస్తికుడివా..? ఓ సారి డిక్లైర్ చేయ్యాలని డిమాండ్ చేశారు. అసలు నీ తప్పేం లేదు.. అసలు తప్పు హిందులదే అన్నారు. నీలాంటి నీశ్చపు డైరెక్టర్లను హిందువులు కనుగొనలేక పోతున్నారన్నారు.
READ MORE: kissing History: ముద్దు ముచ్చట.. ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలో ఫస్ట్ కిస్ స్టోరీ!
ధర్మం పట్ల, హిందూ దేవుళ్ల పట్ల నమ్మకం లేని రాజమౌళి సినిమాలు హిందువులు ఎందుకు చూడాలని రాజాసింగ్ నిలదీశారు. “బాహుబలి సినిమా తీశావు.. ప్రభాస్‌తో శివలింగాన్ని ఎత్తించావు.. కోట్ల రూపాయలు సంపాధించుకున్నావు.. మళ్లీ మా హిందు దేవుళ్లపై నమ్మకం లేదని చెబుతున్నావు. రాజమౌళికి ఇది కొత్తేం కాదు.. భగవాన్ శ్రీకృష్ణుడికి చెందిన 16 వేల మంది దాసులను, లవర్స్ అంటూ హేళన చేశాడు. నాకు రాముడిపైన ఇష్టం లేదు.. రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని గతంలో ట్వీట్ చేశాడు. ఇప్పుడు హనుమంతుడిపైన కామెంట్స్ చేశాడు.. హిందువులకు ఓ సూచన.. ఇలాంటి డైరెక్టర్లపై కంప్లేంట్ ఇవ్వండి. ఇలాంటి వ్యక్తులను జైల్లో వేస్తేనే హిందూ దేవుళ్లపై కామెంట్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇలాంటి పనికిరాని డైరెక్టర్ సినిమాలు చూడొద్దు.. మనం ఇలాంటి వ్యక్తులు తీసిన సినిమాలు చూస్తాం.. వాళ్లు వందలు వేల రూపాయలు సంపాధించుకుంటారు. ఇలా నాస్తికత్వం పేరుతో మన దేవుళ్లపై కామెంట్స్ చేస్తారు.. అందుకే ఈ డైరెక్టర్ సినిమాలు బ్యాన్ చేద్దాం..” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.