Kamal Haasan Tweet on Amaran movie: దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. Reed […]
Priyanka Gandhi: కేరళలోని వాయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 3 నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 3న ప్రియాంక గాంధీ తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన గురించి శుక్రవారం సమాచారం ఇస్తూ.. నవంబర్ 7 వరకు కేరళలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంతో పాటు […]
Pappu Yadav: బీహార్‌లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నన్ను చంపాలనే తొందర ఎవరికైనా ఉంటే వచ్చి చంపేయాలని ఆయన అన్నారు. ఎవరైనా నన్ను చంపాలని తొందరపడితే, త్వరగా వచ్చి చంపేయండి అని అన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపులపై పప్పు యాదవ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు లారెన్స్ బిష్ణోయ్‌ని పప్పు యాదవ్ నేరస్థుడిగా పేర్కొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఫేస్బుక్ లైవ్‌లో పప్పు […]
Nara Bhuvaneswari: నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్‌కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్ లుక్ రివీల్ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా […]
IND vs NZ 3rd Test Match: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తడబడుతోంది. తొలి రెండు టెస్టులలో ఓడిన టీమిండియా చివరి గేమ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసేలా కనపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 235 పరుగులకే పరిమితం చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. దింతో ఇంకా 149 […]
Rashmika Mandanna photos Viral: రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరున్న ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ తన టాలెంట్ నిరూపించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ లో […]
First Analog Space Mission: ఇస్రో (ISRO) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం నాడు లేహ్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించి.. శుక్రవారం నాడు ఆ మిషన్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇస్రో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, అలాగే భూమి బయట విశ్వంలో జీవం కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. మానవ […]
Jai Hanuman: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా నిర్మాణంలో ఉంది. ఇదివరకే ఈ సినిమా హనుమాన్ ను మించి ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చలో ఇప్పటికే […]
India vs New Zealand: ముంబై నగరంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. టీం ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఏకంగా తొమ్మిది వికెట్లను స్పిన్నర్లు తీశారు. ఇందులో జడేజా ఐదు వికెట్స్ పడగొట్టగా.. మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే […]
RBI Repo Rate: భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు డిసెంబర్ మాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన కీలక పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.25 శాతానికి చేరుకుంటుంది. ఇకపోతే, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.49 శాతానికి పెరగగా, ప్రస్తుత త్రైమాసికంలో ఇది 4.9 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. అంతేకాకుండా ఆ తర్వాతి జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం […]