Jai Hanuman: కన్నడ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్‌వర్మ
- కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి
- ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్‌వర్మ.
- ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Hanuman: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా నిర్మాణంలో ఉంది. ఇదివరకే ఈ సినిమా హనుమాన్ ను మించి ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆంజనేయ స్వామి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలిపే పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది.
Read Also: India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
అయితే, రాముడికి హనుమంతుడు ఏమని వాగ్దానం చేసాడన్న విషయానికి “జై హనుమాన్” సినిమా సమాధానం కానుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. తన ప్రాజెక్ట్‌లో నటిస్తునందుకు రిషబ్ శెట్టికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ లో.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టికి ధన్యవాదాలు. అతని అంకితభావం, హనుమంతుని పట్ల అసమానమైన భక్తి ఈ పాత్రకు నిజంగా ప్రాణం పోసింది. అతని అద్భుతమైన పరివర్తన, పరిపూర్ణత, తిరుగులేని నిబద్ధత ‘జై హనుమాన్’ను అత్యద్భుతంగా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు మరపురాని అనుభూతిని అందించడానికి అతను తన వంతు కృషి చేసాడని, నేను మీతో ఈ ప్రయాణం ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానట్లు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా సినిమా తొలి ఫోటో షూట్‌లోని ఓ ఫోటోను షేర్ చేశాడు.
Absolutely overwhelmed by the incredible love for the #JaiHanumanFirstLook 😊
A heartfelt thanks to the National Award Winning Actor @shetty_rishab sir, whose devotion to HANUMAN Ji and unmatched dedication have truly brought this vision to life 🔥
His incredible… pic.twitter.com/oxBTZEdPCy
— Prasanth Varma (@PrasanthVarma) November 1, 2024
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!