Parliament Winter Session: నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పార్లమెంటులోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక నేడు మూడో రోజు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో […]
Papaya Leaves and Seeds: బొప్పాయి పండు తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ, వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు విన్నప్పటికీ.. దాని ఆకులు, విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? లేదు కదా.. అయితే, బొప్పాయి ఆకులు ఇంకా పండులోని విత్తనాలలో అనేక ఖనిజాలతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. […]
WI vs BAN: ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌కు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో విజయాల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా టెస్టులలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇకపోతే, వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు […]
Doctors Died In Road Accident: ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కన్నౌజ్‌లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల […]
Israel- Hezbollah: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆగిపోనుంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోతాయి. దీని కారణంగా లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించడానికి మార్గం సుగమం చేయబడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 3,800 మంది మరణించగా, 16 వేలకు మందికి పైగా గాయపడ్డారు. Also Read: Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన […]
Digital Arrest Fraud: ప్రస్తుత రోజుల్లో దేశంలో సైబర్ నేరాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘డిజిటల్ అరెస్ట్’ సంబంధించి కేసులు తెరపైకి వస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’ ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా ఎవరినైనా నియంత్రించడం లాంటిదే. ఒక్క ఫోన్ కాల్‌తో దీని ఉచ్చులో పడిన వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లే. తాజాగా బాంబే ఐఐటీ విద్యార్థి ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే విద్యార్థి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో ఉద్యోగిగా నటించి […]
Bajrang Punia Banned ny NADA: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది. యాంటీ డోపింగ్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా ఈ నిషేధాన్ని విధించింది. దీని కింద ఇప్పుడు పూనియాపై 4 సంవత్సరాల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దింతో ఆటగాడిగా అతని కెరీర్ ముగిసిందని భావించవచ్చు. జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్‌లో మార్చి 10న డోప్ టెస్ట్ కోసం తన నమూనాను ఇవ్వడానికి నిరాకరించినందుకు బజరంగ్ […]
Drug Peddling Gang Arrested: హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి నగర పోలీసులు, ఎస్టిఎఫ్ పోలీసులు దాడుల నేపథ్యంలో పబ్బులు, ప్రవేట్ పార్టీలలో పెద్ద సంఖ్యలో ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మరోవైపు కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నట్లు సమాచారం. […]
Today Stock Market: ట్రేడింగ్ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలలో ముగిసింది. నేటి ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం నష్టాలలో ముగిసాయి. నేడు సెన్సెక్స్ 106.72 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద ముగిసాయి. ఇక నిఫ్టీలో నేటి ట్రేడింగ్‌లో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ […]
Central Bank Of India Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న ఐటీ స్పెషలిస్ట్‌లకు శుభవార్త. ఎందుకంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ గురించి సమాచారాన్ని పొందడానికి మీరు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ centralbankof india.co.in కి వెళ్లి కెరీర్ ఎంపికకు వెళ్లాలి. నోటిఫికేషన్‌ను చదివిన తర్వాత, మీరు రిక్రూట్మెంట్ ఎంపికకు వెళ్లి , కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి, […]