Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం
- చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా..
- యాంటీ డోపింగ్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా
- 4 ఏళ్ల నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajrang Punia Banned ny NADA: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది. యాంటీ డోపింగ్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా ఈ నిషేధాన్ని విధించింది. దీని కింద ఇప్పుడు పూనియాపై 4 సంవత్సరాల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దింతో ఆటగాడిగా అతని కెరీర్ ముగిసిందని భావించవచ్చు. జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్‌లో మార్చి 10న డోప్ టెస్ట్ కోసం తన నమూనాను ఇవ్వడానికి నిరాకరించినందుకు బజరంగ్ పునియాను NADA మంగళవారం నాలుగేళ్లపాటు సస్పెండ్ చేసింది. అంతకుముందు, ఏప్రిల్ 23న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్‌ను NADA మొదట సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ స్థాయి రెజ్లింగ్ సంస్థ UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) కూడా అతనిని సస్పెండ్ చేసింది.
Also Read: RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బజరంగ్ అప్పీల్ చేసారు. అలాగే NADA అభియోగాల నోటీసును జారీ చేసే వరకు మే 31న NADA క్రమశిక్షణా డోపింగ్ ప్యానెల్ (ADDP) దానిని రద్దు చేసింది. దీని తర్వాత, జూన్ 23న రెజ్లర్‌కు నాడా నోటీసు ఇచ్చింది. ఇకపోతే మరోవైపు, బజరంగ్ పునియా తోటి రెజ్లర్ వినేష్ ఫోగట్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ అతనికి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. అతను జూలై 11న వ్రాతపూర్వకంగా నేరారోపణను సవాలు చేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న విచారణలు జరిగాయి. వాటి తర్వాత చివరకు ఈ నిషేధం ఎదురుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!