Digital Arrest Fraud: ప్రస్తుత రోజుల్లో దేశంలో సైబర్ నేరాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘డిజిటల్ అరెస్ట్’ సంబంధించి కేసులు తెరపైకి వస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’ ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా ఎవరినైనా నియంత్రించడం లాంటిదే. ఒక్క ఫోన్ కాల్‌తో దీని ఉచ్చులో పడిన వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లే. తాజాగా బాంబే ఐఐటీ విద్యార్థి ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే విద్యార్థి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో ఉద్యోగిగా నటించి కాల్ చేసి బెదిరించి రూ.7.29 లక్షలు మోసం చేసి మొదట ‘డిజిటల్‌గా అరెస్టు’ చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు.
Also Read: Komaram Bheem: నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..
ఈ కేసుకు సంబంధించి ముంబైలోని పోవై పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. 25 ఏళ్ల బాధితురాలికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను TRAI ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆ కాల్ లో తన మొబైల్ నంబర్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై 17 ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పాడు. తన నంబర్ డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాల్సి ఉంటుందని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అలాగే తాను సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు కాల్‌ను బదిలీ చేస్తున్నానని చెప్పాడు.
అతను అలా చెప్పిన తర్వాత, వాట్సాప్ వీడియో కాల్‌లో ఒక వ్యక్తి పోలీసు అధికారి దుస్తులలో కనిపించాడు. బాధితురాలి ఆధార్ నంబర్‌ను అడిగి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. యూపీఐ ద్వారా రూ. 29,500 బదిలీ చేయాలని విద్యార్థిని బలవంతం చేశాడు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలిని బెదిరించి, ఆమెను డిజిటల్‌గా అరెస్టు చేశామని ప్రస్తుతం ఎవరినీ సంప్రదించలేవని పేర్కొన్నాడు. మోసగాళ్లు మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. ఈసారి బాధితుడు తన బ్యాంకు వివరాలను పంచుకోవడంతో మోసగాళ్లు అతని ఖాతా నుంచి రూ.7 లక్షలు డ్రా చేశారు.
Also Read: Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం
డబ్బులు తీసుకున్న తర్వాత మీరు క్షేమంగా ఉండండి అని, అరెస్టు చేయబోమని నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. డిజిటల్ అరెస్ట్‌పై ఆందోళన చెంది ఆన్‌లైన్‌లో వెతికిన తర్వాత తాను మోసపోయానని గ్రహించింది. దీంతో విద్యార్థి వెంటనే పోలీసులను ఆశ్రయించి గుర్తు తెలియని నిందితులపై ఫిర్యాదు చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ అనేది సైబర్ మోసంలో బాగా పెరుగుతున్న ప్రక్రియ. దీనిలో మోసగాళ్ళు చట్టాన్ని అమలు చేసే అధికారులు లేదా ప్రభుత్వ ఏజెన్సీల సిబ్బందిగా వ్యవహరిస్తారు. ఆడియో లేదా వీడియో కాల్‌ల ద్వారా బాధితులను బెదిరిస్తారు. బాధితులను డిజిటల్ బందీలుగా తీసుకుని డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.