WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్..
- ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్
- భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs BAN: ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌కు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా టెస్టులలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇకపోతే, వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు 334 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అయితే, విజిటింగ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలడంతో వెస్టిండీస్ జట్టు 201 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది.
Also Read: Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జస్టిన్ గ్రీవ్స్ సెంచరీ, కెమర్ రోచ్ హాఫ్ సెంచరీతో 9 వికెట్లు కోల్పోయి 450 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో మికిల్ లూయిస్ 97 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 115 నాటౌట్, అలెక్ అథనాజే 90 పరుగులు చేశారు. దీని తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బౌలర్ల ముందు కుప్పకూలి 269/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. ఈ విధంగా బంగ్లాదేశ్‌కు 334 పరుగుల విజయ లక్ష్యం లభించింది. అయితే వెస్టిండీస్ బౌలర్లు బంగ్లాదేశ్ ను కేవలం 132 పరుగులకే ఆలౌట్ చేసి 201 పరుగుల తేడాతో విజయం సాధించారు.
Also Read: Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం
వెస్టిండీస్ చేతిలో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ జట్టు డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో కిందకు దిగజారింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టు 9వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకగా, బంగ్లాదేశ్ జట్టు మళ్లీ 9వ స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు 27.50 విజయ శాతంతో 8వ స్థానంలో ఉంది. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని వెస్టిండీస్ ఆక్రమించింది. వెస్టిండీస్ విజయ శాతం 18.52 నుండి 26.67 కి పెరిగింది. అయితే, బంగ్లాదేశ్ విజయ శాతం 25 కి పెరిగింది. WTC ఫైనల్ రేసులో ఇప్పటికే ఇరు జట్లు లేవు. ప్రస్తుతం భారత జట్టు నంబర్-1 స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు తర్వాతి స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!